జనసేనకు బొలిశెట్టి గుడ్‌బై..!
VSP: పర్యావరణానికి సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న పిల్ నేపథ్యంలో నైతిక కారణాలతో జనసేన పార్టీ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి (పర్యావరణం) బొలిశెట్టి సత్యనారాయణ మంగళవారం ప్రకటించారు. న్యాయ ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగాలని, కూటమి ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.