సీ.బెళగల్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు

సీ.బెళగల్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు

KRNL: సీ.బెళగల్ మండలం తిమ్మందొడ్డిలో జరిగిన దొంగతనం కేసును నూతనంగా వచ్చిన SI వేణుగోపాల్ రాజు తన సిబ్బందితో కలిసి ఛేదించారు. దీంతో ఎస్సై, కానిస్టేబుళ్లు భాస్కర్, మల్లికార్జున, సుధాకర్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలులో జరిగిన క్రైమ్ మీటింగ్‌లో అభినందించారు. వారికి ప్రశంసా పత్రాన్ని అందించారు. కాగా, దొంగ నుంచి బంగారం, వెండి, రూ. లక్ష నగదును పోలీసులు రికవరీ చేశారు.