ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
WNP: ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిఓ, ఓపీఓలకు సూచించారు. జిల్లాలో రెండో విడత ఆదివారం నిర్వహించనున్న ఐదు మండలాలలోని గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.