VIDEO: జపాన్ అభిమానులతో రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయనను కలవడానికి కొందరు ఫ్యాన్స్ జపాన్ నుంచి HYDకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్.. వారిని ఇంటికి పిలిచి సరదాగా ముచ్చటించాడు. వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అభిమానులు 'పెద్ది' మూవీ టీషర్ట్స్ వేసుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు SMలో వైరలవుతున్నాయి.