అంగన్‌వాడీలో పోషణ పక్వాడ

ఖమ్మం: టేకులపల్లి మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కె.మంగతార ఆధ్వర్యంలో టేకులపల్లి, బేతంపూడి పంచాయతీలోని వెంకటయ్య తండా, సులానగర్ అంగన్వాడీ కేంద్రం శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసంను ఘనంగా నిర్వహించారు. చిరుధాన్యాల గురించి వాటి నుండి అందే పోషణ గురించి గర్భిణీ మహిళలకు తెలియచేశారు.