కరెన్సీ నోట్ల మార్పిడి.. ముఠా అరెస్ట్

HYD: 2016లో రద్దయిన రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.99 లక్షల రద్దయిన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.