ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్
BHPL: టేకుమట్ల మండల కేంద్రంలోని పంగిడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పాడి పర్చేస్ సెంటర్లను ఇవాళ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, త్వరగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.