వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP

ప్రకాశం: వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను గురువారం కనిగిరి DSP సాయి యశ్వంత్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో 'పల్లె నిద్రను' కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.