ఉగ్రకుట్ర భగ్నం.. 300 కిలోల RDX స్వాధీనం
జమ్మూకశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇటీవల అనంతనాగ్‌లో డాక్టర్ ఆదిల్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి లాకర్ నుంచి ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. ఢిల్లీ ఫరీదాబాద్ వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఏకంగా 300 కిలోల RDX, ఒక ఏకే-47 రైఫిల్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి.