చెంచు కుటుంబాలకు సొంత ఇళ్లు: ఎమ్మెల్యే
VKB: తాండూర్ MLA బుయ్యని మనోహర్ రెడ్డి పెద్దేముల్ మండలం చైతన్య నగర్‌లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణ పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి చెంచు కుటుంబానికి అన్ని వసతులతో పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటి విడతగా 177 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. చైతన్య నగరు 163 ఇళ్లు, బషీరాబాద్ నీళ్ళపల్లికి 14 ఇళ్లు కేటాయించారు.