మొదటి విడత నామినేషన్లు పూర్తి

మొదటి విడత నామినేషన్లు పూర్తి

భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఆదివారం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరిపి, చెల్లుబాటు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.