'NEET పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి'

'NEET పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి'

JN: మే 3న జరిగే NEET పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలలో 566 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.