కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా

కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా

KMM: సకాలంలో రైతులకు సరిపడినంత యూరియాను, పంటలకు గిట్టుబాటు ధరలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం రూరల్ మండలం రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. యూరియా లేకపోవడం వల్ల రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. రైతులను కేంద్రప్రభుత్వం మోసం చేసిందని, రైతులకు సరిపడా యూరియాను అందించాలన్నారు.