ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

TPT: చంద్రగిరి ఇందిరమ్మ కాలనీలో దారుణ హత్య జరిగింది. ఇతర మతస్థురాలైన మహిళతో అశోక్ కుమార్(కొండపల్లి రాజా) అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమెపై దాడికి యత్నించాడు. అడ్డుకున్న కుమారులపై కత్తితో దాడి చేయబోగా వారు కత్తి లాక్కొని తిరిగి దాడి చేశారు. ఈ ఘటనలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ అక్బర్ గాయపడ్డాడు. అక్బర్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.