గోదావరి ఉద్ధృతి.. అధికారుల హెచ్చరికలు

గోదావరి ఉద్ధృతి.. అధికారుల హెచ్చరికలు

MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద సోమవారం గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మేడిగడ్డ, ఎల్లంపల్లి, కడెం, శ్రీరాంసాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరడంతో గోదావరి నీటిమట్టం 13.50 మీటర్లకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.