సిబ్బందికి మిఠాయిలు అందజేసిన ఎస్పీ

సిబ్బందికి మిఠాయిలు అందజేసిన ఎస్పీ

 VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం గుర్ల పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పండగ నేపథ్యంలో ప్రజలకు ప్రయాణం సమయంలో నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సంక్రాంతి సందర్బంగా ఎస్సై నారాయణరావుకు, సిబ్బందికి మిఠాయిలు పంచుతూ.. శుభాకాంక్షలు తెలిపారు.