ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
ELR: పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.