VIDEO: యూరియా కోసం రైతుల అవస్థలు

VIDEO: యూరియా కోసం రైతుల అవస్థలు

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సొసైటీకి అధికారులు 430 బస్తాల యూరియాను పంపించగా, సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున మాత్రమే పంపిణీ చేయడంతో చాలామంది రైతులకు సరిపడా యూరియా దొరకలేదు. ఈ నేపథ్యంలో రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.