'జిల్లాలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలి'

'జిల్లాలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలి'

AKP: అనకాపల్లి జిల్లాలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.