కొల్లిపర మండలంలో భారీ దొంగతనం
GNTR: కొల్లిపర మండలంలోని అత్తోటలో మంగళవారం పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మాజీ సర్పంచ్ బొల్లిముంత సాంబశివరావు భార్య బుల్లెమ్మ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఆమెపై దాడి చేసి చేతులకు ఉన్న ఎనిమిది బంగారపు గాజులు, ఒక చైను, ఉంగరాలు దోచుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.