ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ పుణ్యగిరికి 15 ప్రత్యేక బస్సులు
VZM: మహా శివరాత్రి సందర్భంగా ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పుణ్యగిరి, సన్యాసయ్యపాలెంకు ఆదివారం ఉదయం 4.30 నుంచి సోమవారం సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో ప్రబంధకుడు ఎస్.సుదర్శనరావు శుక్రవారం తెలిపారు.ఎ స్.కోట నుంచి పుణ్యగురికి 15 బస్సులు, సన్యాసయ్యపాలెంకు మూడు బస్సులు తిరుగుతాయని చెప్పారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.