సంగం బ్యారేజీని పరిశీలించిన: ట్రైని కలెక్టర్

నెల్లూరు: సంగం బ్యారేజిను ట్రైనీ కలెక్టర్ సంజనా సిన్హా సందర్శించారు. ఇరిగేషన్ ఎస్.ఈ కృష్ణమోహన్ తో కలిసి బ్యారేజిను పరిశీలించిన ఆమె బ్యారేజి స్థితి గతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బ్రిటీష్ కాలంలో నిర్మించిన పెన్నా ఆనకట్ట వివరాలు, సాగునీటి విడుదల తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.