నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: మర్రిగూడ మండలం దామర భీమనపల్లి, కమ్మగూడెం, లెంకలపల్లి గ్రామాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి మ. 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. 33 కెవి శివన్నగూడెం, 33 కెవి దామర భీమనపల్లి సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.