సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో

VZM: గవరమ్మపేట సచివాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం మండల పరిషత్ అధికారి ఎస్.రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఎస్ఎం ఈ సర్వే, సూర్య ఘర్, ఆధార్ లేని పిల్లలు, నాన్ రెసిడెన్స్ ఏపీ పైన సచివాలయ సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ రికార్డులను తనిఖీ చేశారు. అలాగే గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల, అంగన్వాడి సెంటర్లను తనిఖీ చేశారు.