సామెత.. దాని అర్థం

సామెత: అంత ఉరుము ఉరిమి.. ఇంతేనా కురిసేది
అర్థం: అమితంగా వాగ్ధానాలు ఇచ్చి చాలా స్వల్పంగా దానాలు చేసేవారి గురించి, ఎంతో పనిచేస్తామని చెప్పి చాలా కొద్దిగా పనిచేసే వారి గురించి ఈ సామెత వాడుతారు. ఎక్కువగా హెచ్చులు చెప్పి తక్కువ పనిచేసే పద్ధతి సందర్భంలోనూ ఉపయోగిస్తారు. అలాగే, పెద్ద పెద్ద ఉరుములు ఉరిమి.. కొంత వర్షం కురిస్తే కూడా ఇలాంటి సామెత వాడుతారు.