104 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవదానం

HYD: జేసీఐ బంజారా HYD ఆధ్వర్యంలో 104 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు దానం చేశారు. రెడ్ హిల్స్‌లోని FTCCIలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షుడు సర్వేశ్ నేతృత్వంలో జేసీఐ జాతీయ అధ్యక్షుడు అన్కూర్ ముఖ్య అతిథిగా పాల్గొని, కృత్రిమ అవయవాలను అందించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆర్గనైజర్స్ తెలిపారు.