రౌడీ షీటర్లను ఉక్కుపాదంతో అణచివేయాలి: సీపీ

HNK: నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రౌడీ షీటర్లను ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.