ప్రజలతో మొరటుగా వ్యవహరించొద్దు: జిల్లా ఎస్పీ

ప్రజలతో మొరటుగా వ్యవహరించొద్దు: జిల్లా ఎస్పీ

NRML: గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు పై పోలీసుల సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల బందోబస్తు సమయంలో ప్రజలతో మొరటుగా వ్యవహరించవద్దని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసుల తరఫున కృషి చేయాలని వారు సూచించారు.