ఎస్‌కోట సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
VZM: ఎస్.కోట సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్ష చూపరాదని, అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.