నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం 5వ విడతలో భాగంగా బుధవారం 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.544 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు పొదుపుగా పంట సాగుకు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.