గాయపడిన ఏఎన్ఎం మృతి

CTR: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఏఎన్ఎం రమాదేవి మృతి చెందారు. శివరామపురం పంచాయతీ గట్టూరు గ్రామానికి చెందిన రమాదేవి(38) రాళ్లబూదుగూరు పీహెచ్సీలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన శాంతిపురం వెళ్లి విధులు ముగించుకొని ఎస్బీఐ వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు.