ఒంటిమిట్టకు తిరుమల శ్రీవారి లడ్డూలు
KDP: ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. స్థానిక శ్రీవారి సేవాసదన్-1లో ఆదివారం 300 మంది శ్రీవారి సేవకులతో లడ్డూల ప్యాకింగ్‌ను టీటీడీ నిర్వహించింది. తిరుమల ఎస్టేట్స్ అధికారి వేంకటేశ్వర్లు పర్యవేక్షించారు. లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా ప్రక్రియలన్నీ పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు.