'పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రజిత చెప్పారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని పరిశీలించారు.