ప్రభుత్వ విద్యార్థులకు షూస్ పంపిణీ

MBNR: గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలోని MEO జనార్దన్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు నరసింహ రావు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు షూస్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరన్న, కాంగ్రెస్ నాయకులు బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.