VIDEO: సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్

VIDEO: సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్

WG: నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల బిల్లులు రావడం లేదని సర్పంచ్ కొట్టు రామాంజనేయులు సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సొంత నిధులతో పనులు చేసినా అధికారులు బిల్లులు చెల్లించడం లేదని, దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.