గ్యాస్ ధర పెంపు ఉపసంహరించాలి: సీపీఎం
TPT: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 ధర పెంపును సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు ఖండించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్ ధర పెంపు సామాన్యులపై భారంగా మారుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పెంపును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.