పల్లెల్లో శాంతియుత వాతావరణం ఉండాలి: ఎస్సై

పల్లెల్లో శాంతియుత వాతావరణం ఉండాలి: ఎస్సై

BPT: కారంచేడు మండలం తిమ్మిరిత్తపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ భాషా పాల్గొని గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించారు. పల్లెల్లో శాంతియుత వాతావరణం ఉండాలని ఆ దిశగా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉండాలని ఎస్సై సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలన్నారు.