రేపటీ నుంచి టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు

రేపటీ నుంచి టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు

ప్రకాశం: టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) బుధవారం నుంచి ఈనెల 21వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అందుకోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.అభ్యర్థులు నిర్దేశితసమయం కంటే ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.