ఈవీఎంల తరలింపు తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి

నెల్లిమర్ల: స్థానిక ఈవీఎం గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తనిఖీ చేసారు. నియోజకవర్గాలకు కేటాయించబడ్డ ఈవీఎంల సీరియల్ నంబర్ల ప్రకారం వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో వాహనాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు.