కనెక్టర్ బాక్సులో మంటలు

కనెక్టర్ బాక్సులో మంటలు

KDP: జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీని కారణంగా ముద్దనూరు రోడ్డులోని అమ్మా హోటల్ ఎదురుగా డివైడర్లపై ఏర్పాటు చేసిన కనెక్టర్ బాక్సులో ఎక్కువ తేమ చేరడంతో తీగలు వద్ద పెద్ద పెద్ద శబ్దాలతో బాక్సు నుంచి మంటలు చెలరేగి బాక్సు తగలబడింది. దీంతో వీధి లైట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.