గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ శివారులో ఉన్న గోదావరి నదిలో గల్లంతైన గుండా శ్రావణ్ మృతదేహం లభ్యమయింది. శనివారం గోదావరిలో స్నానానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి గ్రామ శివారులో శ్రావణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ జన్నారంలో వ్యాపారిగా గుర్తింపు పొందారు.