ఘనంగా డివైఎఫ్ఐ దినోత్సవ కార్యక్రమం

ఘనంగా డివైఎఫ్ఐ దినోత్సవ కార్యక్రమం

NLG: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలో భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. డివైఎఫ్ఐ జెండాని జిల్లా అధ్యక్షులు రవి నాయక్ ఆవిష్కరించారు. అనంతరం సుభాష్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ ఎన్జీ కాలేజ్ మీదుగా శివాజీ నగర్ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.