డిప్యూటీ సీఎం కోసం ప్రత్యేక పూజలు చేసిన నాయకులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ గోత్రం పేరున అర్చన చేయించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక మంత్రోచ్ఛారణతో స్వామికి పూజలు చేసి, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.