అదృశ్యమైన బాలుడు మృతి

ATP: గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన కైలాస్ అనే 17 ఏళ్ల బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. రాయదుర్గం సమీపంలోని విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కొండకు శనివారం వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఆలయం సమీప కొండపై ఉరివేసుకున్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.