బాంబ్ హౌస్ సేల్ గూడను పరిశీలించిన కలెక్టర్
ASF: కోడూరుపాడులోని వెదురు పనిముట్లు బాంబ్ హౌస్ సేల్ గూడను జిల్లా కలెక్టర్ కె. హరిత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను, విక్రయాలను స్వయంగా పరిశీలించారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి, అవసరమైన సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.