ఆటో బోల్తా.. మహిళకు గాయాలు
నంద్యాల: ఉయ్యాలవాడ సమీపంలో శనివారం ఆటో బోల్తా పడడంతో వెంకట లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్దయమ్మనూరు నుంచి కూతురిని సంజామలకు తీసుకెళ్తుండగా రహదారిపై వడ్లను తప్పించబోయి ఆటో పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన ఆమెను ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు లేకపోవడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.