లోక్ అదాలత్ లో 545 కేసులు పరిష్కారం
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జూనియర్ సివిల్ జడ్జ్ మంథని శ్రీధర్ కేసులకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించారు. ఇరు వర్గాల కక్షిదారులకు రాజీతో మొత్తం 545 కేసులు లోక్ ఆదాలత్ లో పరిష్కారమైనట్లు జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.