గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

NZB: బోధన్ పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలకు శ్రద్ధగా సిద్ధం కావాలని, ఏకాగ్రతతో ఉండాలని వారికి సూచించారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.