ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
VSP: విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ (రచ్చబండ) కార్యక్రమం మంగళవారం జరిగింది. ఎస్సీ విభాగం అధ్యక్షుడు దొండపర్తి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్త కె.కె. రాజు హాజరై ప్రజలు, విద్యార్థులు, మేధావుల నుంచి సంతకాలు స్వీకరించారు.