జర్నలిస్టుల ముసుగులో వసూలు.. ఇద్దరికీ రిమండ్

MHBD: జర్నలిస్టుల ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం తొర్రూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దంతాలపల్లికి చెందిన విజేందర్, పెద్దవంగరకు చెందిన శ్యాం విద్యార్థి ఫెడరేషన్ పేరుతో విద్యాసంస్థల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.